Browsing Shortcuts: విండోస్ బ్రౌజింగ్: ఈ షార్ట్ కట్స్ తో సమయం సేవ్ చేసుకోండి

windows keyboard shortcuts for browsing


ఈ కాలంలో ఏ సమాచారం కోసమైనా ముందుగా వెతికేది ఆన్‌లైన్‌లోనే. బ్రౌజింగ్ అనేది నిత్య కృత్యం. కానీ అనేక మంది బ్రౌజింగ్ కోసం ఎక్కువగా మౌస్‌ను వాడుతుంటారు. మెనూలను ఎంచుకునేందుకు, ట్యాబ్‌ల మధ్య మారేందుకు ఎక్కువగా మౌస్‌పైనే ఆధారపడతారు. మౌస్‌తో చాలా సులువుగా పని అవుతోందని అనుకుంటారు కానీ దీని వల్ల చాలా సమయమే వృథా అవుతుంది. చేతులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు, బ్రౌజింగ్ మరింత సులభతరం చేసేందుకు విండోస్ కీబోర్డు షార్ట్ కట్స్ ఎంతో ఉపయోగపడతాయి. వీటిని గుర్తుపెట్టుకోవడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా ఒక్కసారి అలవాటైతే మెరుపు వేగంతో బ్రౌజింగ్ చేయొచ్చు. మరి విండోస్‌లో ఇందుకు సంబంధించి ఏయే షార్ట్‌ కట్‌లు అందుబాటులో ఉన్నాయో? వాటిని ఏయే సందర్భాల్లో వినియోగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామా!

  • Loading...

More Telugu News