Pawan Kalyan: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan responds to retired IAS officer EAS Sharma letter

  • ముడసర్లోవ వద్ద జీవీఎంసీ నిర్మాణాలు చేపడుతున్నారన్న శర్మ
  • శర్మ లేఖపై జీవీఎంసీ అధికారుల వివరణ కోరిన పవన్ కల్యాణ్
  • అలాంటి ప్రతిపాదనలేవీ లేవన్న అధికారులు

పరిపాలనకు కొత్త అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై పవన్ కల్యాణ్ స్పందించారు. ముడసర్లోవ వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని శర్మ తన లేఖలో పేర్కొన్నారు. 

నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ... ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని శర్మ కోరారు. 

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖపై పవన్ కల్యాణ్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయవద్దని అధికారులకు నిర్దేశించారు. అయితే, ముడసర్లోవ వద్ద నిర్మాణాలేవీ చేపట్టడంలేదని, అలంటి ప్రతిపాదనలేవీ లేవని జీవీఎంసీ అధికారులు పవన్ కు తెలియజేశారు.

  • Loading...

More Telugu News