Revanth Reddy: కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం వల్లే పిల్లలు పక్కదారి పడుతున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy suggetion in NSS programme

  • విద్యార్థులకు మంచీ చెడులు చెప్పాల్సిన బాధ్యత మన పైనే ఉందన్న సీఎం
  • విద్యార్థులందరూ మన పిల్లలు అనేలా అందరూ చూసుకోవాలని సూచన
  • డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన
  • తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించాలని సూచన

కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం వల్లే చాలామంది పిల్లలు పక్కదారి పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు మంచీ చెడులు చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... విద్యార్థులందరూ మన పిల్లలు అనేలా అందరూ చూసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించాలని సూచించారు. వారికి మంచీ చెడులు చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News