K Kavitha: కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Court postponed Kavitha default bail petition

  • విచారణను జులై 22కు వాయిదా వేసిన ట్రయల్ కోర్టు
  • సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయన్న కవిత తరఫు న్యాయవాది
  • చార్జిషీట్‌లో తప్పులు లేవన్న సీబీఐ తరఫు న్యాయవాది

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్‌పై విచారణను జులై 22కు వాయిదా వేసింది.

ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News