Kejriwal: కేజ్రీవాల్ కు ఈడీ కేసులో మధ్యంతర బెయిల్

Big Supreme Court Relief For Arvind Kejriwal In Delhi Liquory Policy Case

  • సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎంకు ఊరట
  • ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బెయిల్
  • సీబీఐ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని గుర్తుచేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన 90 రోజులకు పైగా విచారణ ఎదుర్కొన్నారని చెబుతూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తుతం బెయిల్ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ పై ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో కేజ్రీవాల్ విడుదలయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News