Joe Biden: ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్.. మరోమారు తడబడిన బైడెన్

Biden Calls Kamala Harris As Vice President Trump

  • తడబడుతూ, పొరబడుతూ తరచూ వార్తల్లోకి బైడెన్
  • ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ట్రంప్ తడబాటు
  • 81 ఏళ్ల వయసులో రెండోసారి పోటీ పడుతుండడంపై చర్చ
  • పొరపాటు సహజమేనంటూ ‘నాటో’ దేశాల అండ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పొరపాటు పడడం అలవాటుగా మారిపోయింది. 81 ఏళ్ల బైడెన్ మరోమారు అగ్రరాజ్య అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఇటీవల ఆయన తరచూ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడమే కాకుండా ఆయన మానసిక స్థితిపైనా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా ఉపాధ్యక్షుడిగా, పుతిన్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పేర్కొని మరోమారు వార్తల్లోకి ఎక్కారు. 

నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు అనంతరం బైడెన్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మీరు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే కనుక ట్రంప్‌ను కమలా హ్యారిస్‌ ఓడించగలరంటారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి బైడెన్ సమాధానమిస్తూ.. అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు లేకుంటే ట్రంప్‌ను అసలు ఉపాధ్యక్షుడిగా తీసుకునేవాడిని కాదనని పేర్కొన్నారు. 

అలాగే, మీడియా సమావేశానికి ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కూటమి సభ్య దేశాల ప్రతినిధులకు బైడెన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీని ప్రసంగానికి ఆహ్వానిస్తూ ‘అధ్యక్షుడు పుతిన్’ అని పేర్కొన్నారు. బైడెన్ తరచూ చేస్తున్న పొరపాట్లు తీవ్ర చర్చనీయాంశం అవుతుండగా నాటో సభ్య దేశాల నేతలు మాత్రం బైడెన్‌కు అండగా నిలిచారు. ఎవరైనా అప్పుడప్పుడు ఇలాంటి పొరపాటు చేస్తుంటారని, అది సహజమేనంటూ తేలిగ్గా తీసుకున్నారు.

  • Loading...

More Telugu News