Pawan Kalyan: 250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Road connectivity to every village with population above 250

  • పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులతో సమీక్ష
  • ఏపీలో 7,213 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడి
  • రోడ్ల నిర్మాణం కోసం రూ.4,976 కోట్లను ఖర్చు చేస్తామన్న ఉపముఖ్యమంత్రి

250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్లను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో 7,213 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం కోసం రూ.4,976 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ 10 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News