Woman: ఈత కొడుతూ పసిఫిక్ మహాసముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్విమ్మర్.. రక్షించిన కోస్ట్ గార్డ్

Woman swimming off Japanese beach was swept into the Ocean

  • 37 గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయిన మహిళా స్విమ్మర్
  • ఆమె కోసం ఆ దేశ కోస్ట్ గార్డ్ గాలింపు
  • హెలికాప్టర్ ద్వారా మహిళా స్విమ్మర్‌ను కాపాడిన జపాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది

ఈతకొడుతూ ప్రమాదవశాత్తు పసిఫిక్ మహాసముద్రంలోకి కొట్టుకుపోయిన మహిళా స్విమ్మర్ 37 గంటల పాటు ఆ నీటిలోనే చిక్కుకుపోయింది. చివరికి ఆమెను కోస్ట్ గార్డ్ రక్షించింది. ఈ ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా స్విమ్మర్ జపాన్‌లోని ఓ బీచ్‌ వద్ద సముద్రంలో ఈతకొడుతుండగా అనుకోకుండా లోపలి కొట్టుకుపోయింది. ఆమె కోసం ఆ దేశ కోస్ట్ గార్డ్ సిబ్బంది 37 గంటల పాటు  గాలించారు. చివరికి హెలికాప్టర్ ద్వారా మహిళను కాపాడారు.

హెలికాప్టర్ ద్వారా తాడు కిందకు వేశారు. ఆమె తాడు సాయంతో పైకి రాగా... ఓ నౌకలో ఆమెను దింపారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్విమ్మింగ్ రింగ్ సాయంతో మహిళ తన ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. సముద్రంలో 80కి పైగా కిలో మీటర్ల దూరం వరకు ఆమె కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఆమెను చైనా దేశస్థురాలిగా గుర్తించారు.

More Telugu News