Ramcharan: కోట్ల రూపాయల కొత్త కారుతో రామ్ చరణ్.. వీడియో ఇదిగో

Ramcharan new car

  • రోల్స్ రాయిస్ లేటెస్ట్ వెర్షన్ స్పెక్ట్రా కారును కొన్న చరణ్
  • దీని ధర రూ. 7.5 కోట్లు అని సమాచారం
  • ఈ కారుకు హైదరాబాద్ లో తొలి కస్టమర్ చరణ్

'ఆర్ఆర్ఆర్' మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు ఉత్తరాదిన కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' కోసం ఆయన ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్, బుచ్చిబాబు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. 

మరోవైపు ఇప్పటికే రామ్ చరణ్ వద్ద ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా ఈ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది. రోల్స్ రాయిస్ లేటెస్ట్ వెర్షన్ స్పెక్ట్రా కారును చరణ్ కొన్నారు. దీని ధర ఏకంగా రూ. 7.5 కోట్లు అని సమాచారం. 

తాజాగా ముంబైలో జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వేడుకలకు వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ కారులోనే చరణ్ వెళ్లారు. తన భార్య ఉపాసన, కూతులు క్లీంకారలతో కలిసి ఆయన ముంబై వెళ్లారు. ఎయిర్ పోర్టుకు కారును చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు హైదరాబాద్ సిటీలో ఈ కారు ఫస్ట్ కస్టమర్ చరణ్ కావడం గమనార్హం.

More Telugu News