Nadendla Manohar: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపీఎస్‌ల పాత్ర: మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

Minister Nadendla Manohar blames four ips in ration issue

  • కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు వెల్లడి
  • అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని వ్యాఖ్య
  • పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపీఎస్‌ అధికారుల పాత్ర ఉందంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందన్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేసే మొదటి కౌంటర్‌ను నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

హోల్ సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు కూడా రూ.160కే నాణ్యమైన కిలో కందిపప్పును అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్ముందు పంచదార సహా పలు చిరుధాన్యాలను కూడా రైతు బజార్లలో రాయితీపై విక్రయిస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామన్నారు. ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News