Apoorv Jain: ఒక్క రూపాయి ఆదాయపు పన్ను వివాదం.. సీఏకు రూ. 50 వేల చెల్లింపు!

Delhi Man Rs 50000 to settle one rupee dispute

  • ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసు అందుకున్న అపూర్వ్ జైన్
  • దానిని పట్టుకుని సీఏ వద్దకు వెళ్తే రూ. 50 వేల ఫీజు
  • చివరికి ఆ నోటీసు రూపాయి వివాదానికి సంబంధించినదని తేలిన వైనం
  • నెత్తీనోరూ బాదుకుంటూ సోషల్ మీడియాకెక్కిన అపూర్వ్ జైన్

ఆదాయపన్ను శాఖతో రూపాయి విలువైన వివాదం పరిష్కారానికి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్‌కు ఏకంగా రూ. 50 వేలు సమర్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడించాడు. తాను జోక్ చేయడం లేదని చెప్పుకొచ్చాడు. అపూర్వ్ జైన్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం నుంచి ఇటీవల ఓ నోటీసు వచ్చింది. అయితే, అది ఎందుకొచ్చిందో తెలుసుకునేందుకు దానిని పట్టుకుని చార్టెడ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లాడు. ఆ నోటీసు సంగతేంటో తెలుసుకునేందుకు ఆ సీఏ ఏకంగా రూ. 50 వేలు ఫీజుగా తీసుకున్నాడు. చివరికి తేలిందేంటంటే ఆ వివాదం కేవలం ఒక్క రూపాయికి సంబంధించినదని! అసలు విషయం తెలిశాక అపూర్వ్ నోరెళ్లబెట్టాడు. రూపాయి కోసం రూ. 50 వేలు పోగొట్టుకున్నట్టు తెలిసి నెత్తీనోరు బాదుకున్నాడు. 

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి తన ఆవేదన వెళ్లగక్కాడు. ఇది చూసిన నెటిజన్లు రెండుగా విడిపోయి చర్చకు తెరదీశారు. కొందరు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, మరికొందరు ‌జైన్‌ను తప్పుబడుతున్నారు. వివాదంలో ఉన్న మొత్తం గురించి అతడు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చిన్న మొత్తాల విషయంలో సీఏ జోక్యం లేకుండానే పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. చాలామంది ట్యాక్స్ టెర్రరిజం బారిన పడుతున్నారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News