Laxmi Parvathi: లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్ షిప్

Professorship For Laxmi Parvathi In AU

  • ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాదరెడ్డి
  • పీహెచ్ డీ పరిశోధకులకు గైడ్ గా లక్ష్మీపార్వతి నియామకం
  • అర్హత లేకున్నా నియమించడంతో పీహెచ్ డీ విద్యార్థులకు ఇబ్బందులు

జగన్ పాలనలో ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వైసీపీ కార్యాలయంగా మారిపోయిందని, అప్పట్లో వీసీగా వ్యవహరించిన ప్రసాదరెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన నిర్వాకాల్లో ఒకటి బయటపడింది. వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఆయన ఏకంగా ప్రొఫెసర్ షిప్ హోదా కట్టబెట్టారు. పీహెచ్ డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. ఇందుకుగానూ లక్ష్మీపార్వతికి కొంతమొత్తం చెల్లింపులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలు లేకున్నా ఈ నియామకం జరిగింది. దీనిపై విద్యార్థులు ఆందోళనవ్యక్తం చేసినా ప్రసాదరెడ్డి పట్టించుకోలేదని సమాచారం.  

వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నవారు పీహెచ్ డీ చేసే అవకాశం కల్పించేందుకు ఏయూలో టీడీఆర్ హబ్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో వీసీ ప్రసాదరెడ్డి ఇందులో తెలుగు ప్రొఫెసర్ హోదాతో లక్ష్మీపార్వతిని గైడ్ గా నియమించారు. పది మంది పరిశోధకులకు కూడా ఆమెను గైడ్‌ను చేశారు. విజయవాడలో ఉంటున్న లక్ష్మీపార్వతి విశాఖపట్నం వచ్చేది ఎప్పుడు.. తమను గైడ్ చేసేదెన్నడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అవన్నీ తాము చూసుకుంటామని వీసీ ప్రసాదరెడ్డి వారికి చెప్పారు. వైసీపీకి అన్ని రకాలుగా సహకరించిన ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులకు అవసరమైన పీహెచ్‌డీలు ప్రదానం చేసేందుకే ఈ టీడీఆర్‌ హబ్‌ని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

గైడ్ గా ఉండాలంటే అర్హతలు..
పీహెచ్ డీ పరిశోధకులకు గైడ్ గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్ గా కనీసం ఐదేళ్లపాటు పాఠాలు చెప్పి ఉండాలి. పీహెచ్ డీ అందించే ప్రక్రియలో కనీసం ఒక్కరికైనా సహకరించి ఉండాలి. లక్ష్మీపార్వతికి ఈ అర్హతలు ఏవీ లేకున్నా ఆమెను పీహెచ్ డీ విద్యార్థులకు గైడ్ గా నియమించడం వివాదాస్పదంగా మారింది.

  • Loading...

More Telugu News