Deccan Chronical: ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు?: డెక్కన్ క్రానికల్ వ్యవహారంపై విశాఖ ఎంపీ భరత్

MP Bharat reacts on deccan Chronical issue

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ లో కథనం
  • నిరసన తెలిపేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులు
  • డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • డెక్కన్ క్రానికల్ ది బాధ్యతా రాహిత్యం అంటూ భరత్ విమర్శలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం వివాదాస్పదంగా మారింది. దీనిపై టీడీపీ విద్యార్థి సంఘం, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వ్యవహారంపై విశాఖ టీడీపీ ఎంపీ భరత్ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని డెక్కన్ క్రానికల్ పత్రికకు భరత్ హితవు పలికారు. 

"చంద్రబాబు కానీ, ఇక్కడి ఎంపీగా నేను కానీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ కానీ, ఎమ్మెల్యేలుగా పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్ కానీ ఎప్పుడైనా ఏమైనా అన్నామా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీషు మీడియా ఆ విధంగా రాయడం బాధ్యతా రాహిత్యం. ఇది చాలామంది జీవితాలతో ముడిపడిన అంశం. అలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై మేం చర్యలు తీసుకుంటాం" అని భరత్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News