Revanth Reddy: హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టండి: రేవంత్ రెడ్డి ఆదేశాలు

Revanth Reddy review on road winding works

  • రెండు నెలల్లో పనులను ప్రారంభిస్తామన్న అధికారులు
  • రోడ్లకు భూసేకరణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన ముఖ్యమంత్రి
  • రిజిస్ట్రేషన్, మార్కెట్ ధర వ్యత్యాసం వల్ల రైతులు ముందుకు రావడం లేదన్న కలెక్టర్లు
  • భూసేకరణపై మానవీయ కోణంతో వ్యవహరించాలని సూచన

హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. పనులను 2 నెలల్లో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, రోడ్లకు భూసేకరణ ప్రక్రియలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు.

రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలన్నారు. నిబంధనల ప్రకారం రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. రహదారుల కోసం భూములు కోల్పోతున్న రైతులను పిలిచి మాట్లాడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆర్మూర్-నాగపూర్ కారిడార్‌కు ప్రభుత్వ భూములను కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ - మన్నెగూడ పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షను నిర్వహించారు. సమీక్షలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News