KTR: ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌లకు రక్షణ లేదా?: కేటీఆర్

KTR fires at congress government over journalists issue

  • జర్నలిస్ట్‌ల పట్ల పోలీసుల వైఖరిని ఖండించిన కేటీఆర్
  • నిన్న బల్కంపేటలో మహిళా జర్నలిస్ట్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం
  • ఈరోజు ఓయూలో రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు

ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌లకు రక్షణ లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే... విధి నిర్వహణలో భాగంగా కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్‌ల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జర్నలిస్ట్‌ల పట్ల పోలీసుల వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. నిన్న బల్కంపేటలో మహిళా జర్నలిస్ట్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఈరోజు ఓయూలో రిపోర్టర్ గల్లా పట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జర్నలిస్ట్‌లకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News