Chandrababu: ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై సీఎం చంద్రబాబు కసరత్తులు

CM Chandrababu works on finance ministry white paper

  • ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ అంశాలపై శ్వేతపత్రాల విడుదల
  • ఆర్థికశాఖపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష 

ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ దిశగా కసరత్తులు చేస్తున్నారు. 

రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. 

పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది.

More Telugu News