Seagulls attack: దొంగ పక్షులు.. నోటికాడి శాండ్ విచ్ ను క్షణంలో కాజేశాయి.. వీడియో ఇదిగో!

Seagulls attack woman eating sandwich while live streaming

  • లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ శాండ్ విచ్ తినేందుకు యూట్యూబర్ ప్రయత్నం
  • ఒక్కసారిగా దాడి చేసిన సీగల్స్ గుంపు
  • భయంతో శాండ్ విచ్ పక్కన పడేసిన మహిళ
  • ఆ ముక్కలు అందుకుని ఎగిరిపోయిన పక్షులు

ఓ మహిళ చేతిలోని శాండ్ విచ్ ను పక్షుల గుంపు క్షణాలలో ఎత్తుకెళ్లిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నది ఒడ్డున కూర్చుని లంచ్ చేసేందుకు ప్రయత్నించిన సదరు మహిళ ఈ అనుకోని దాడితో కేకలు పెట్టింది. ఆపై చేతిలో ఉన్న శాండ్ విచ్ కోసమే ఆ పక్షులు దాడి చేశాయని గమనించి, దానిని పక్కన పడేసింది. దీంతో ఆ శాండ్ విచ్ ముక్కలను నోట కరుచుకుని, ఆ పక్షులు అక్కడి నుంచి ఎగిరిపోయాయి. కొన్ని సెకన్లలోనే అంతా అయిపోయింది. అప్పటికే ఆ మహిళ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండడంతో ఇదంతా వీడియోలో రికార్డయింది.

మనుషుల చేతుల్లోని ఆహార పదార్థాలను ఇట్టే మాయం చేయడంలో సీగల్స్ పక్షులు ఆరితేరాయి. కన్నుమూసి తెరిచేలోపు చేతిలోని ఆహార పదార్థాన్ని నోట కరుచుకుని ఎగిరిపోతాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. అయితే, తాజాగా ఓ మహిళ నది ఒడ్డున కూర్చుని బ్యాగులో నుంచి శాండ్ విచ్ బయటకు తీసింది. దానిపైనున్న రేపర్ తీసి నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించేలోగా సీగల్స్ వాసన పసిగట్టాయి. అంతే, ఒక్కసారిగా మహిళపై దాడి చేసి శాండ్ విచ్ ను మాయం చేశాయి. దీనిపై సదరు యూట్యూబర్ స్పందిస్తూ.. సీగల్స్ దాడి చేయడంతో తొలుత భయపడి కేకలు వేశానని, శాండ్ విచ్ పక్కన పడేయడంతో అవి తన జోలికి రాలేదని చెప్పారు. చుట్టుపక్కల ఉన్నవారు సాయానికి వచ్చేలోగా సీగల్స్ తమ పని పూర్తిచేసుకుని ఎగిరిపోయాయని చెప్పారు.

More Telugu News