Road Accident: పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 18 మంది మృతి.. యూపీలో విషాదం

18 dead as sleeper bus rams into milk tanker


ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీ వెళ్తున్న స్లీపర్ బస్సు ఈ తెల్లవారుజామున ఉన్నావో వద్ద పాల ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం ఆదేశాలతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News