Jay Shah: ఐసీసీ తదుపరి చైర్మన్‌గా జైషా?

BCCI Secretary Jay Shah could become the next chairman of the ICC says a report

  • నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు
  • ఆయన బరిలోకి దిగితే పోటీ ఉండదన్న ‘క్రిక్‌బజ్’ కథనం
  • ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఆయనకే ఎక్కువని వెల్లడి

ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌ జై షా తదుపరి ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్)  చైర్మన్ పదవికి పోటీ పడాలనుకుంటున్నారా? ఐసీసీ నిర్వహణలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారా?.. అంటే ఔననే అంటోంది ‘క్రిక్‌బజ్’ కథనం. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయని,  పోటీ చేయాలని భావిస్తే జైషాకు ఎలాంటి పోటీ ఉండబోదని కథనం పేర్కొంది.  జై షా భావిస్తే ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే నుంచి బాధ్యతలు అందుకునేందుకు పోటీ పడే ప్రధాన అభ్యర్థి ఆయనేనని విశ్లేషించింది.

కాగా  చైర్మన్ పదవికి పోటీ విషయంలో జైషా తన అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ఐసీసీ పాలనలో మార్పులు తీసుకురావాలని జైషా భావిస్తున్నారని, ముఖ్యంగా ఇటీవల అమెరికా, వెస్టిండీస్  వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఐసీసీ కార్యకలాపాలలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్టు పేర్కొంది. కాగా ఐసీసీ చైర్మన్ పదవీకాలం ప్రస్తుతం రెండు సంవత్సరాలు ఉండగా దానిని మూడేళ్లకు పెంచారు. అయితే తిరిగి ఈ పదవికి ఎన్నికయ్యేందుకు కేవలం ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.

కాగా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా 2009లో జై షా తన క్రికెట్ పాలన నిర్వహణతో తన అనుబంధాన్ని మొదలుపెట్టారు. 2015లో బీసీసీఐలో చేరారు. సెప్టెంబర్ 2019లో బోర్డు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News