Supreme Court: ఇకపై సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఉండకూడదు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court laid down guidelines against disparaging portrayal of persons with disabilities in visual media and films

  • అవిటివాడు, స్పాస్టిక్ వంటి పదాలు వారిపై సామాజిక వివక్షకు దారితీస్తాయన్న‌ సుప్రీంకోర్టు
  • సినిమా స్క్రీనింగ్‌కు ముందు సీబీఎఫ్‌సీ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచ‌న‌
  • దివ్యాంగులపై వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మీడియా కృషి చేయాలని వ్యాఖ్య‌

'అవిటివాడు', 'స్పాస్టిక్' వంటి పదాలు వారిని సామాజిక వివక్షకు గురయ్యేలా చేస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సినిమాలు, దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సోమవారం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. 

సినిమా స్క్రీనింగ్‌కు అనుమతించే ముందు సర్టిఫికేట్ ఇచ్చే సీబీఎఫ్‌సీ నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. దివ్యాంగులపై వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మీడియా కృషి చేయాలని తెలిపింది. అలాగే దివ్యాంగుల సవాళ్లను మాత్రమే కాకుండా వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని న్యాయ‌స్థానం పేర్కొంది. 

ఇటీవ‌ల వ‌చ్చిన‌ బాలీవుడ్ చిత్రం 'ఆంఖ్‌ మిచోలీ'లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన‌ న్యాయ‌స్థానం ఈ మేరకు తీర్పును వెల్ల‌డించింది.

  • Loading...

More Telugu News