Tirumala: తిరుమలలో దళారుల భరతం పడుతున్న ప్రభుత్వం.. 208 మంది అరెస్ట్

Police arrested 208 brokers in Tirumala
తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన టీడీపీ ప్రభుత్వం దళారులను ఏరిపారేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలకు సిద్ధమవుతోంది. టీటీడీ గదుల విషయంలో అక్రమాలకు పాల్పడిన దళారుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. 

2019 నుంచి ఇప్పటి వరకు దళారుల అక్రమాలపై 279 కేసులు నమోదయ్యాయి. అలాగే, నకిలీ ఆధార్‌తో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించి వీరిలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 381 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. గదుల బుకింగ్ సమయంలో నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
Tirumala
Tirupati
Brokers
Andhra Pradesh
TTD

More Telugu News