Shashi Tharoor: మీ ట్రోలింగ్‌కు హ్యాపీ.. జింబాబ్వేపై యువ భారత్ గెలుపు తర్వాత శశిథరూర్

Trolled for happy cause Shashi Tharoor x post viral

  • జింబాబ్వేపై తొలి మ్యాచ్‌లో ఓడినందుకు శశిథరూర్ ఘాటు వ్యాఖ్యలు
  • జింబాబ్వేలో బీసీసీఐ గర్వం అణగిపోయిందంటూ ఎక్స్
  • రెండో మ్యాచ్‌లో విజయం తర్వాత పొగడ్తలు
  • విరుచుకుపడిన బీజేపీ

‘మీ ట్రోలింగ్‌కు సంతోషంగా ఉంది’.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం తర్వాత ఆయనీ పోస్ట్ చేశారు. భారత జట్టు విజయానికి అభినందనలు తెలుపుతూ.. ‘ఈ రోజు జింబాబ్వే 100 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టుకు అభినందనలు. ముఖ్యంగా అభిషేక్ శర్మ టీ20లలో భారత్ తరపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌. నిన్న వారి పేలవ ప్రదర్శన నుంచి త్వరగా కోలుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చారు.

అంతేకాదు, మంచి కారణానికి ట్రోల్ చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంది అని పేర్కొన్నారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమి తర్వాత బీసీసీఐని ఉద్దేశించి ‘అహంభావి’గా అభివర్ణిస్తూ పోస్టు పెట్టారు. అంతేకాదు, విషయాలను తేలిగ్గా తీసుకుంటుందని విమర్శించారు. 

ముంబైలో టీ20 ప్రపంచకప్ విజయోత్సవ సంబరాల ప్రతిధ్వనులు చెవుల్లో ఇంకా మార్మోగుతుండగానే హరారేలో ఈ రోజు జింబాబ్వే చేతిలో ఓడిపోయామని, బీసీసీఐ దీనిని తేలిగ్గా తీసుకున్నట్టు అర్థమైందని శశిథరూర్ విమర్శించారు. జూన్ 4, లేదంటే 6న జింబాబ్వేలో అహంకారం అణగిపోయిందని తిరువనంతపురం ఎంపీ ఆ పోస్టులో పేర్కొనడం వివాదాస్పదమైంది. రెండో వన్డేలో భారత జట్టు విజయం తర్వాత బీజేపీ స్పందిస్తూ భారత జట్టుకు కాంగ్రెస్, థరూర్ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News