Anjali: జీ 5లో 'బహిష్కరణ' వెబ్ సిరీస్ .. వేశ్యగా అంజలి!

Bahishkarana

  • అంజలి ప్రధాన పాత్రగా 'బహిష్కరణ'
  • గ్రామీణ నేపథ్యలో నడిచే కథ 
  • 6 ఎపిసోడ్స్ గా పలకరించనున్న సిరీస్ 
  • ముఖ్యమైన పాత్రలో అనన్య నాగళ్ల


అంజలి ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇంతకుముందు ఆమె చేసిన 'ఝాన్సీ' వెబ్ సిరీస్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి మరో వెబ్ సిరీస్ రావడానికి రంగం సిద్ధమవుతోంది .. ఆ సిరీస్ పేరే 'బహిష్కరణ'. జీ 5 - పిక్సల్ పిక్చర్స్ వారు కలిసి నిర్మించిన ఈ సిరీస్ కి, ముఖేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు. 

నిజానికి 'బహిష్కరణ' అనేది బలమైన టైటిల్ .. బరువైన టైటిల్ అనే చెప్పాలి. ఇక ఎంత బలమైన పాత్ర అయినా .. కథనైనా తన భుజాలపై తీరానికి చేర్చగల సత్తా అంజలికి ఉంది. అలాంటి ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా ఈ నెల 19వ తేదీ నుంచి జీ 5లో  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రీసెంటుగా వదిలిన టీజర్ ఈ సిరీస్ పై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ అనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. అంజలి పాత్ర వేశ్య తరహాలో అందాలను ఎరవేస్తూ హత్యలు చేయడం చూపించారు. అంజలి ఆ గ్రామానికి ఎందుకు వస్తుంది? హత్యలు ఎందుకు చేస్తోంది? అనేదే ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అనన్య నాగళ్ల .. రవీంద్ర విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉంటుందనేది చూడాలి.

Anjali
Ananya Nagalla
Ravindra Vijay
Bahishkarana
  • Loading...

More Telugu News