Samsung: శాంసంగ్ చరిత్రలోనే అతిపెద్ద సమ్మె.. నిలిచిపోతున్న సెమీకండక్టర్ల ఉత్పత్తి

Samsung union steps up pressure over pay with 3 day strike

  • శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద సమ్మె
  • మూడు రోజులపాటు కార్మికుల వాకౌట్
  • సెమీకండక్టర్ల ఉత్పత్తికి ఆటంకం కలిగించడమే లక్ష్యం

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద సమ్మెను ఎదుర్కొంటోంది. దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తోంది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది.

శాంసంగ్ అర్ధ శతాబ్దపు చరిత్రలో ఈ స్థాయిలో సమ్మెకు వెళ్లడం ఇదే తొలిసారి. అత్యంత అధునాతన చిప్‌లు తయారుచేసే వాటిలో ఒకటైన ఇక్కడి ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ సమ్మె లక్ష్యమని యూనియన్ నాయకులు చెబుతున్నారు. రాజధాని సియోల్‌కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్వాసోంగ్‌లోని సెమీ కండక్టర్  ప్లాంట్ల బయట దాదాపు 5 వేల మందితో ర్యాలీ నిర్వహించాలని యూనియన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ర్యాలీకి ఎంతమంది హాజరవుతారన్న విషయంలో స్పష్టత లేదని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యున్-కుక్ తెలిపారు. ఈ సమ్మె కారణంగా శాంసంగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News