Shankar: భారతీయుడు ఇక్కడే తిరుగుతున్నాడన్న రెస్పెక్ట్ తో కూడిన భయం ఉండేది: దర్శకుడు శంకర్

Director Shankar speech in Bharateeyudu2 pre release event

  • హైదరాబాదులో భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • హాజరైన దర్శకుడు శంకర్
  • సేనాపతి గెటప్ లో కమల్ ను చూసి గూస్ బంప్స్ వచ్చాయని వెల్లడి 

హైదరాబాదులో నిర్వహించిన భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడారు. భారతీయుడు చిత్రం తర్వాత తాను అనేక సినిమాలు చేసుకుంటూ వెళ్లానని, కానీ పేపర్ చూసిన ప్రతిసారి లంచం గురించి ఏదో ఒక వార్త కనిపించేదని శంకర్ వెల్లడించారు. అలాంటి వార్తలు చూస్తే తనకు వెంటనే భారతీయుడు చిత్రంలోని సేనాపతి క్యారెక్టర్ గుర్తుకు వచ్చేదని తెలిపారు. దాంతో, మళ్లీ భారతీయుడు రావాలి, భారతీయుడు రావాలి అని మైండ్ లో ఆలోచనలు వస్తుండేవి కానీ, పర్ఫెక్ట్ స్టోరీ కుదరలేదని వివరించారు. 

రోబో 2.0 సమయంలో భారతీయుడు-2 స్టోరీ కరెక్ట్ గా సెట్ అయిందని తెలిపారు. కమల్ సర్ వద్దకు వెళ్లి స్టోరీ చెబితే, ఆయనకు కూడా నచ్చిందని శంకర్ వెల్లడించారు. 

"సేనాపతి క్యారెక్టర్ డిజైన్ చేయడం కోసం... కమల్ గారి ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్... వాళ్ల నాన్న గారి ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్... వాళ్ల ఇద్దరి బ్రదర్స్ ఫ్రంట్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్ తీసి ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారికి ఇచ్చాం. దాంతో ఆయన వాటన్నింటి నుంచి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఇచ్చారు. అదే ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్. 

ఆ స్కెచ్ చూసిన వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నేను ఊహించుకున్న క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది కదా అనిపించింది. ఇక, పాతికేళ్ల కిందట భారతీయుడు షూటింగ్ మొదటి రోజున సేనాపతి గెటప్ లో కమల్ హాసన్ సెట్స్ పైకి రాగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సేనాపతి గెటప్ లో ఆయన్ని చూడగానే మళ్లీ గూస్ బంప్స్ వచ్చాయి. 

ఆ గెటప్ లో కమల్ హాసన్ కాదు... మాకు సేనాపతే కనిపించేవారు. భారతీయుడు ఇక్కడే తిరుగుతున్నాడన్న ఓ రెస్పెక్ట్ తో కూడిన భయం ఉండేది... సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ కు కూడా గూస్ బంప్స్ రావడం ఖాయం. నేను కానీ, రచయితలు కానీ సీన్ రాసేటప్పుడు కంటే, కమల్ గారు వచ్చి నటించేటప్పుడు ఆ సీన్ 10 రెట్లు ఎలివేట్ అయ్యేది. కమల్ సర్ నటన చూస్తే ఇంతకంటే ఇంకెవరూ పెర్ఫామ్ చేయలేరేమో అనిపించేది. భారతీయుడు-2 చిత్రంలో ఆయన సీన్లన్నీ ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తాయి. 

ఇక సిద్ధార్థ్ ను సినీ రంగానికి పరిచయం చేసింది నేనే. తొలి సినిమా చేసేటప్పుడే 10 సినిమాలు చేసిన అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఇప్పుడు భారతీయుడు-2 సినిమాలో 100 సినిమాలు చేసిన అనుభవం ఉన్నవాడిలా నటించాడు. రకుల్ ప్రీత్ కూడా ఎంతో చక్కగా నటించింది. ఆమెకు భాష తెలియకపోయినా, ఎంతో శ్రద్ధతో సీన్లన్నీ నేర్చుకుని కచ్చితంగా పెర్ఫామ్ చేసింది. 

ఎస్.జె.సూర్య ఒక టేక్ తో సంతృప్తిపడే నటుడు కాదు. ఇంకొక్క టేక్, ఇంకొక్క టేక్ అంటూ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. ప్రతి మాటకు ఎక్స్ ప్రెషన్, బాడీ లాంగ్వేజి సరిపోయేదాకా టేక్ లు తీసుకుని సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ప్రయత్నిస్తారు. భారతీయుడు-2లో ఆయనది చిన్న రోలే. అయితే భారతీయుడు-3లో కాస్తంత పెద్ద రోల్, గేమ్ చేంజర్ లో ఆయనది మెయిన్ రోల్. బాబీ సింహా ఎంతో శ్రమిస్తాడు. ఈ సినిమా కోసం మనసా వాచా కర్మణా కృషి చేశాడు. 

సముద్రఖని గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఆయన వాయిస్ నాకు బాగా ఇష్టం. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేశారు. ఫుల్ స్టోరీని మైండ్ లో పెట్టుకుని తన పాత్రకు న్యాయం చేసే నటుడు సముద్రఖని గారు. బ్రహ్మానందం గారిది కూడా ఈ సినిమాలో క్యామియో రోల్. ఒక సీన్ బ్రహ్మానందం గారూ అని చెప్పాం... ఆయన వెంటనే ఒప్పుకున్నారు. శంకర్ గారూ... మీ సినిమాలో నేను చేస్తున్నాను అంటూ ఓకే చెప్పేశారు. ఆయనది ఎంతో లవ్లీ బిహేవియర్. బ్రహ్మానందం గారికి గేమ్ చేంజర్ లో కూడా ఒక సీన్ ఉంది. 

కాజల్ అగర్వాల్ భారతీయుడు-2లో లేరు, భారతీయుడు-3లో ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ చక్కని సంగీతం అందించారు. అనిరుధ్ ఓ ట్యూన్ ఇస్తాడు... ఎలా ఉంది సార్ అని అడుగుతాడు. 80 శాతం బాగుంది అని చెబితే... కుదరదు సార్... 100 శాతం నచ్చే వరకు నేను ట్యూన్లు ఇస్తూనే ఉంటాను అని చెప్పేవాడు" అంటూ శంకర్ వివరించారు. 

భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తళుక్కుమన్న రకుల్ ప్రీత్


అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసింది. కమల్ హాసన్ ప్రధానపాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు-2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ కూడా నటించింది. అమ్మడు టూ పీస్ ఈవెనింగ్ గౌన్ లో తళుక్కుమంది.

  • Loading...

More Telugu News