Pawan Kalyan: హద్దులు దాటొద్దు... జనసేన పార్టీ క్యాడర్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan Kalyan warns party cadre

  • జనసేన శ్రేణులు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దన్న పవన్
  • జనసేన శ్రేణులన్నీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపు
  • గీత దాటితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులను కించపరిచేలా జనసేన నేతలు, కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

"అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఏపీ పాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలవాలి. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. 

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా మాట్లాడినా, నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. 

అంతేకాదు, ప్రోటోకాల్ కు విరుద్ధంగా అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రోటోకాల్ గీత దాటే వారి పైనా చర్యలు ఉంటాయి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News