Spain: పెద్దవాళ్లకు మాత్రమే సినిమాల కోసం ‘పోర్న్ పాస్ పోర్ట్’.. ఎక్కడంటే?

Spain Introduces Porn Passport To Watch Adult Content Online

  • వినూత్న మొబైల్ యాప్ తీసుకొచ్చిన స్పెయిన్
  • యాప్ లో లాగిన్ కోసం వయసు నిర్ధారణ తప్పనిసరి
  • ఆపై యూజర్లకు నెలనెలా క్రెడిట్స్ ఇవ్వనున్న ప్రభుత్వం
  • వీటి సాయంతోనే ఆన్ లైన్ లో పోర్న్ చూసేందుకు వీలు

పెద్దవాళ్లకు మాత్రమే.. 18 ఏళ్లలోపు పిల్లలు చూడొద్దంటూ పోర్న్ చూడడానికి ఎన్ని నిబంధనలు పెట్టినా ఉపయోగం లేకపోవడంతో స్పెయిన్ సరికొత్త ఆలోచన చేసింది. పోర్న్ సినిమాలు కేవలం పెద్దవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త మొబైల్ యాప్ ను తయారుచేసింది. పోర్న్ పాస్ పోర్ట్ గా వ్యవహరిస్తున్న ఈ యాప్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ సాయంతో పిల్లలు పోర్న్ సినిమాలు చూడకుండా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఏంటీ పోర్న్ పాస్ పోర్ట్..?
ఇదొక మొబైల్ యాప్. పద్దెనిమిదేళ్లు నిండిన వారు ఆన్ లైన్ లో పోర్న్ చూసేందుకు చట్టబద్ధంగా అవకాశం కల్పిస్తుంది. ఈ యాప్ లో లాగిన్ అయ్యేందుకు స్పెయిన్ ప్రభుత్వం జారీ చేసిన 5 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఐడీలోని వయసు ఆధారంగా యూజర్ ఏజ్ కన్ఫర్మ్ చేసుకుని, పద్దెనిమిదేళ్లు పైబడిన వారికే యాక్సెస్ కల్పిస్తుంది. ఒకసారి లాగిన్ అయ్యాక యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీకి నెలనెలా 30 పోర్న్ క్రెడిట్స్ జమ అవుతాయి. ఆన్ లైన్ లో పోర్న్ చూసేందుకు ఈ క్రెడిట్స్ ఉపయోగపడతాయి. ఈ క్రెడిట్స్ లేకుండా పోర్న్ చూడడం (ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్లలో) సాధ్యం కాదు. పోర్న్ చూసే సమయాన్ని బట్టి క్రెడిట్స్ ఖర్చవుతుంటాయి. నెల పూర్తికాకముందే 30 క్రెడిట్స్ ఖర్చుపెట్టేస్తే.. అదనపు క్రెడిట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను తొందర్లోనే అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనిద్వారా చిన్న పిల్లలు ఆన్ లైన్ లో పోర్న్ చూడకుండా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. 

కట్టడి సాధ్యమేనా..
ఆన్ లైన్ లో పోర్న్ సైట్లు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రభుత్వ చట్టాల ప్రకారం మైనర్లకు తమ కంటెంట్ అందకుండా ఆయా సైట్లు జాగ్రత్తలు తీసుకుంటాయి. వయసు నిర్ధారణకు ఆయా సైట్లు తమకంటూ ప్రత్యేకంగా పద్ధతులను రూపొందించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న యాప్ ను పోర్న్ సైట్లు ఆమోదిస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకం. దీనిపైనే పోర్న్ పాస్ పోర్ట్ పనితీరు ఆధారపడి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News