Jagan Residence: ఆ ఇల్లు మార్కెట్ రేటు ప్రకారమే జగన్ మా దగ్గర కొన్నారు: నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వివరణ

Ghattamaneni Adiseshagiri Rao clarifies on Jagan residence in Mangalagiri

  • తాడేపల్లిలో జగన్ నివాసంపై వివాదం
  • ఘట్టమనేని ఇంటిని జగన్ బలవంతంగా రాయించుకున్నాడంటూ ప్రచారం
  • జగన్ మార్కెట్ రేటు ప్రకారమే కొనుక్కున్నాడన్న ఆదిశేషగిరిరావు
  • జగన్ కోసం ఆ ఇంటిని తానే ప్లాన్ చేశానని వెల్లడి

కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసే క్రమంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మంగళగిరిలో నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటిని బలవంతంగా రాయించుకున్నాడంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఓ వీడియో పంచుకుంది. ఆ వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్వయంగా ఇచ్చిన వివరణ ఉంది. ఇదంతా సోషల్ మీడియా ప్రచారమే తప్ప, అందులో నిజం లేదని ఆదిశేషగిరిరావు స్పష్టం చేశారు. 

"మంగళగిరి ప్రాంతంలో మా అబ్బాయి విల్లా ప్రాజక్టు చేపట్టాడు. ఆ విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు కూడా ఒక భాగం. జగన్ మామూలుగానే మార్కెట్ రేటు ప్రకారమే కొన్నాడు... కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన బిల్లులు కూడా అన్నీ చెల్లించారు. ఆ విధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. 2019 ఎన్నికలకు  ముందు... ఇల్లు ఎలా ఉండాలి, ఆఫీసు ఎలా ఉండాలి అని ప్లాన్ చేసింది నేనే. 

జగన్ సైట్ కూడా చూడలేదు. సైట్ కొలిపించడం కానీ, కన్ స్ట్రక్షన్ కానీ అన్నీ నేనే చూసుకున్నాను... ఆయన డిజైన్లు చూశాడంతే... కన్ స్ట్రక్షన్ అప్పుడు కూడా రాలేదు. గృహప్రవేశం అప్పుడు వచ్చాడు. అన్నీ వాస్తు ప్రకారం కట్టించి ఇచ్చాం. అంతే తప్ప.. మిగతాదంతా ఒట్టి ప్రచారమే" అని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News