K Kavitha: సీబీఐ కోర్టులో కవితకు చుక్కెదురు... జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Kavitha judicial remand extended

  • జులై 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
  • ఈరోజుతో ముగిసిన కవిత జ్యుడీషియల్ రిమాండ్
  • మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ట్రయల్ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జులై 18 వరకు పొడిగించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఈరోజుతో ముగిసింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కవితను సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది.

అంతకుముందే, ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించిన సీబీఐ, ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈడీతో పాటు సీబీఐ కేసులలో కవిత చాలాకాలంగా జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కోర్టులో తిరస్కరణకు గురవుతున్నాయి.

K Kavitha
BRS
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News