Stock Market: నేటి స్టాక్ మార్కెట్: స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

Sensex ended up with minimal loses

  • భారత స్టాక్ మార్కెట్లలో నేడు ప్రతికూల పవనాలు
  • ఉదయం నష్టాలతో మొదలైన ట్రేడింగ్
  • అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులతో ప్రభావితమైన సెన్సెక్స్, నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్లో నేడు ప్రతికూల పవనాలు వీచాయి. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులు భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీపై ప్రభావం చూపించాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ఆరంభంలో నష్టాలు ఎదుర్కొన్న సూచీలు... సాయంత్రానికి కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. 

ముగింపు సమయానికి సెన్సెక్స్ 53.07 పాయింట్ల నష్టంతో 79, 996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 21.70 పాయింట్ల లాభంతో 24,323 వద్ద ముగిసింది. 

ఓఎన్జీసీ, రిలయన్స్, ఎస్బీఐ, బ్రిటానియా, సిప్లా షేర్లు లాభపడగా... హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మైండ్ ట్రీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

  • Loading...

More Telugu News