Jogi Ramesh: చంద్రబాబు నివాసంపై దాడికేసు.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు జోగి రమేశ్
![YCP Leader Jogi Ramesh Steps To High Court For Anticipatory Bail On CBN House Attack](https://imgd.ap7am.com/thumbnail/cr-20240705tn6687a0a21318d.jpg)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిపై గతంలో జరిగిన దాడికేసును పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేశ్ పిటిషన్‌ను కోర్టు ఈ నెల 8న విచారించనున్నట్టు సమాచారం.