Microsoft: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల కోత

Microsoft lays off employees in new round of cuts
  • వివిధ ప్రాంతాల్లోని ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన ఓ మీడియా సంస్థ
  • ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడికాని వైనం 
  • గత ఏడాదిలో 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గిన ఉద్యోగులు
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (లేఆఫ్స్)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్‌లకు చెందిన వారిని తొలగించినట్లు గ్రీన్ వైర్ అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు. వివరాలు వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించినట్లు పేర్కొంది.

ఉద్యోగం పోయిన పలువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతుండటాన్ని బట్టి చూస్తే.. ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నట్లుగా అర్థమవుతోందని పేర్కొంది. గత ఏడాదిలో మైక్రోసాఫ్ట్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గింది.

వ్యాపార నిర్వహణలో సంస్థాగత, శ్రామిక శక్తిలో మార్పులు సాధారణమేనని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వృద్ధికి ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందన్నారు.
Microsoft
Employees
Software

More Telugu News