Revanth Reddy: చంద్రబాబుతో సమావేశమవుతున్నట్లు అమిత్ షాతో చెప్పాను: రేవంత్ రెడ్డి

Revanth Reddy tells Amit shah about his meeting with Chandrababu

  • కూర్చొని పరిష్కరించుకుంటే... సహకారం ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడి
  • కూర్చొని చర్చించిన తర్వాత సీఎంల స్థాయిలో పరిష్కారమవుతాయా? లేదా? తెలుస్తాయని వ్యాఖ్య
  • ఇంకా సమస్య ఉంటే కేంద్రం... ఆ తర్వాత చట్టం వున్నాయని వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ నెల 6న సమావేశమవుతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరో తేదీన మంచి వాతావరణంలో ఇరువురు ముఖ్యమంత్రులం చర్చించుకుంటున్నామని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

'మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది' అని అమిత్ షా తమకు హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. నీటి పంపకాలు సహా ఎన్నో అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించిన తర్వాత కదా సీఎంల స్థాయిలో పరిష్కారమవుతాయా? లేదా? అని తెలిసేది అన్నారు. ఇరువురు సీఎంలు కూర్చున్న తర్వాత కూడా ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కేంద్రం సహకరిస్తుందన్నారు. ఇంకా సమస్య ఉంటే చట్టం ఉందన్నారు.

  • Loading...

More Telugu News