LK Advani: ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

LK advani hospitalized


బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డా. వినీత్ సూరీ ఆధ్వర్యంలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత నెల 26న అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

LK Advani
New Delhi
BJP
  • Loading...

More Telugu News