Jagga Reddy: చంద్రబాబు పుణ్యంతో మోదీ ప్రధాని అయ్యారు: జగ్గారెడ్డి

Jagga Reddy fires at PM Narendra Modi

  • చంద్రబాబు అపాయింట్‌మెంట్ అడిగితే మోదీ ఇవ్వలేదని విమర్శ
  • మోదీ ప్రధాని అయ్యారంటే చంద్రబాబు, నితీశ్ కుమార్ పుణ్యమేనని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి బీజేపీ గేమ్ అడిందన్న జగ్గారెడ్డి

నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యారంటే చంద్రబాబు, నితీశ్ కుమార్ పుణ్యమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వని మోదీ, ఇప్పుడు అదే చంద్రబాబు పుణ్యంతో ప్రధాని అయ్యారన్నారు. పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి బీజేపీ గేమ్ ఆడిందని విమర్శించారు. 

రాహుల్ గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర అయితే, బీజేపీది, ప్రధాని మోదీది మోసాల చరిత్ర అని ఆయన విమర్శించారు. మోదీ ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల సభలో శివుడి పటాన్ని లోక్ సభలో ప్రదర్శించారని తెలిపారు. కానీ ప్రధాని ఎప్పుడైనా రాముడి ఫొటోను ప్రదర్శించారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై ఏం మాట్లాడాలో తెలియక పిల్ల చేష్టలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రశ్నలతో మోదీ మైండ్ బ్లాక్ అయిందన్నారు.

Jagga Reddy
Chandrababu
Pawan Kalyan
BJP
  • Loading...

More Telugu News