Yanamala: వైసీపీ నేతల అక్రమార్జనను ప్రత్యేక చట్టంతో రాబట్టాలి: యనమల

TDP Senior Leader Yanamal Ramakrishnudu pens Chandrababu

  • సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీనియర్ లీడర్
  • రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాలని సూచన
  • ఆర్థిక మంత్రిగా తనకున్న అనుభవంతో పలు సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబునిచ్చారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. గతంలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన యనమల.. తన అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు పలు సూచనలు చేశారు. 

వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ప్రత్యేకమైన చట్టం ఉపయోగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యనమల సూచించారు. గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కారు చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని కొనియాడారు. యనమల కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు. మ్యానిఫెస్టో హామీల అమలుకు తోడ్పడుతూనే రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని ఈ సూచనలు మెరుగుపరుస్తాయని చెప్పారు.

  • బిల్లుల చెల్లింపులకు సీఎఫ్‌ఎంఎస్‌ వాడండి..
  • పన్ను ఆదాయాల క్రమబద్ధీకరణ, సహేతుకమైన స్థిర రుణాలు, ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ తదితర అంశాలపై కేంద్రాన్ని అభ్యర్థించండి
  • వేస్‌ అండ్ మీన్స్, ఓడీని జాగ్రత్తగా వినియోగించుకోవాలి
  • అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా వ్యయాలు తగ్గించుకోవాలి
  • మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలి
  • సహజ వనరులను రక్షించాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి
  • ఈ చర్యలతో ద్రవ్య లోటును ప్రస్తుతానికి నియంత్రించాలి. దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో లోటు తగ్గుతుంది
  • అవినీతిని అరికట్టడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం నెలకొల్పవచ్చు
  • చంద్రబాబు దార్శనిక నాయకత్వం, సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని యనమల ఈ లేఖలో ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News