Motilal Naik: స్పందించని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. దీక్ష విరమించిన మోతీలాల్

OU student JAC leader Motilal Naik ends his hunger srike

  • నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మోతీలాల్ దీక్ష
  • 9 రోజులు అయినా స్పందించని ప్రభుత్వం
  • ఆరోగ్యం విషమిస్తుండడంతో దీక్ష విరమణ
  • ప్రత్యక్ష పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతోపాటు గ్రూప్1లో 1:100 రేషియోలో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్.

తొమ్మిది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కిడ్నీలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్ష విరమించినట్టు మోతీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News