YS Jagan: జగన్ నివాసం వెనుక అడ్డంకుల తొలగింపు.. స్థానికుల హర్షం

Officials Remove Hardles At YS Jagan Residence

  • జగన్ నివాసం సమీపంలోకి రాకుండా బారికేడ్లు
  • టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్ల ఏర్పాటు
  • క్రేన్ల సాయంతో అన్నింటినీ తొలగించిన అధికారులు

తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లేన్ల రహదారిలో రాకపోకలు పునరుద్ధరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఇటువైపు సామాన్యులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధిస్తూ పలు అడ్డంకులు ఏర్పాటు చేశారు. 

పొరపాటున ఎవరైనా వెళ్లినా వారి వాహనాల టైర్లు పంక్చర్ అయ్యేలా టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లు ఏర్పాటు చేశారు. అధికారులు గతరాత్రి వీటన్నింటినీ క్రేన్ల సాయంతో తొలగించారు. అలాగే, రోడ్డుపై వేసిన రెయిన్‌ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీం వైపు ఉన్న పోలీస్ చెక్‌పోస్టును కూడా ఎత్తివేశారు. అడ్డంకులు తొలగి రహదారి తిరిగి అందుబాటులోకి వస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

YS Jagan
Tadepalli
YSRCP
Amaravati
  • Loading...

More Telugu News