C Ramachandraiah: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఎన్డీయే కూటమి

C Ramachandraiah and Hariprasad are MLC candidates of the NDA alliance

  • సి. రామచంద్రయ్య, హరిప్రసాద్‌ పేర్లు ఖరారు
  • చెరొకటి పంచుకున్న టీడీపీ, జనసేన
  • ఈ నెల 12న జరగనున్న ఉప ఎన్నిక
  • శాసనసభలో సంఖ్యా బలం దృష్ట్యా ఎన్నిక లాంఛనమే

సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య మరోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు. అదేవిధంగా జనసేనకు తొలిసారి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా.. ఎన్డీయే కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు కూటమి నేతలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్‌ లీడర్ సి. రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పించింది. ఇక మరో స్థానానికి జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసా‌ద్‌ పేరును ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. వీరిద్దరు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఎన్‌డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా  వీరిద్దరి ఎన్నిక లాంఛనమే కానుంది.

కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా.. ఇక్బాల్‌ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

  • Loading...

More Telugu News