Ambati Rambabu: పోలవరం గురించి బాబు గారికి కూడా అర్థం కాలేదన్నమాట!: అంబటి రాంబాబు సెటైర్

Ambati Rambabu satires on Chandrababu


పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసినప్పటి నుంచి, మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో అంబటి ఓ పోస్టు పెట్టారు. కాఫర్ డ్యామ్ లు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న బాబు గారికి ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదన్న మాట? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే చెప్పాను... పోలవరం క్లిష్టమైన ప్రాజెక్టు అని... అర్థం కావడం కష్టం అని! అంటూ అంబటి ట్వీట్ చేశారు. తన ట్వీట్  కు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీడియో క్లిప్పింగ్ ను కూడా అంబటి జతచేశారు.

More Telugu News