NTR Film Awards: హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

NTR Film Awards function held at Hotel Dasapalla in Hyderabad

  • రాఘవి మీడియా, కళావేదిక ఆధ్వర్యంలో అవార్డుల ఫంక్షన్
  • హైదరాబాద్ హోటల్ దసపల్లా వేదికగా కార్యక్రమం
  • బేబీ చిత్రానికి రెండు అవార్డులు

రాఘవి మీడియా, కళా వేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం నేడు హైదరాబాదులో ఘనంగా జరిగింది. హోటల్ దసపల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేశ్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ సినిమా హీరో ఆనంద్ దేవరకొండకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. భగవంత్ కేసరి చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా సాహు గారపాటి అవార్డు అందుకున్నారు. 

కాగా, ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేదికపై మురళీమోహన్ ను నిర్వాహకులు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుల వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. 

అవార్డులు అందుకున్న వారిలో కల్యాణ్ చక్రవర్తి (రచయిత/గీత రచయిత), రఘు కుంచే, శరణ్య ప్రదీప్, హర్షవర్ధన్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News