New Delhi: ఢిల్లీలో భారీ వర్షం ఎఫెక్ట్... ఒక్కరోజే మెట్రో రైళ్లలో 69 లక్షల మంది ప్రయాణం
- జూన్ 27న 62,58,072 లక్షల మంది, జూన్ 28న 69,36,425 మంది ప్రయాణం
- భారీ వర్షాలు ఉన్నప్పటికీ 99.95 శాతం సమయానికే మెట్రో రైళ్ల పరుగు
- వర్షం నేపథ్యంలో వాహనాలపై వెళ్తే ట్రాఫిక్ సమస్య ఉంటుందని.. మెట్రో ఎక్కిన ఢిల్లీవాసులు
ఢిల్లీ మెట్రో రైల్ రికార్డ్ సృష్టించింది. నగరంలో భారీ వర్షం ప్రభావంతో మెట్రో రైళ్లలో శుక్రవారం (జూన్ 29) ఒకేరోజున 69 లక్షలమంది ప్రయాణించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే 7 లక్షల మంది అధికంగా ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైలు డేటా ప్రకారం, జూన్ 27వ తేదీన 62,58,072 మంది, మరుసటి రోజున 69,36,425 మంది మెట్రో రైల్లో ప్రయాణించారు.
భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ 99.95 శాతం మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికే రన్ అవుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రధానంగా, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలాచోట్ల రోడ్ల పైనే నీరు నిలిచింది. దీంతో వాహనాలపై కార్యాలయాలకు వెళ్తే ట్రాఫిక్ సమస్య సహా వివిధ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది మెట్రో రైలును ఆశ్రయించారు. వర్షంలో సొంత వాహనాలకు బదులు ఢిల్లీ మెట్రో రైలును వినియోగించుకోవడంపై ఢిల్లీ మెట్రో హర్షం వ్యక్తం చేసింది.