Vijay Deverakonda: 'క‌ల్కి' రూ. 1000 కోట్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda Tweet on Kalki 2898 AD Movie

  • ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి 2898 ఏడీ’ 
  • మూవీకి మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్‌
  • రెండు రోజుల్లోనే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 298.5 కోట్లు వ‌సూళ్లు
  • తాజాగా సినిమా చూసి 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన విజ‌య్ దేవ‌రకొండ

రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్‌ను జోడించి రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో క‌ల్కి క‌లెక్ష‌న్ల‌లో దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 298.5 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇప్ప‌టికే మూవీని వీక్షించిన ప‌లువురు ప్ర‌ముఖులు భార‌త సినిమాను మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

తాజాగా టాలీవుడ్ యువ హీరో విజ‌య్ దేవ‌రకొండ కూడా సినిమాను చూసి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించాడు. ఈ మూవీతో ఇండియ‌న్ సినిమా న్యూ లెవెల్ అన్‌లాక్ అయింద‌ని విజ‌య్ అన్నాడు. ఇంతకుముందే సినిమా చూశాన‌ని, ఏం చెప్పాలో కూడా అర్థం కావ‌ట్లేద‌న్నాడు. ఈ సినిమా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చాడు. కాగా, క‌ల్కిలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించిన విష‌యం తెలిసిందే.

More Telugu News