Uttar Pradesh: షాకింగ్ వీడియో.. ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి వెళ్లిన కారు!

Car Crushes Toddler Playing Outside Noida House In Front of Mother

  • యూపీలోని నోయిడాలో ఘ‌ట‌న‌
  • తీవ్ర గాయాలతో చిన్నారి ప‌రిస్థితి విష‌మం
  • ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్

యూపీలోని నోయిడాలో రోడ్డుపై ఆడుకుంటున్న ఏడాదిన్న‌ర చిన్నారి పైనుంచి కారు వెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి సెక్టార్-63లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తీవ్ర గాయాల పాలవడంతో చిన్నారిని స్థానికులు వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం పాప ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన‌ సెక్టార్-63 పోలీసులు ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన వాహనాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ప‌రారీలో ఉన్న కారు డ్రైవర్‌ను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. 

ఇక దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం, వీడియోలో కనిపించిన చిన్నారి తల్లిని రింకీగా గుర్తించారు. ఆమె కనౌజియా అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న‌ట్లు తెలిసింది. త‌ల్లీకూతురు ఇంటి గేటు ద‌గ్గ‌ర రోడ్డుపై ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

More Telugu News