Komatireddy Venkat Reddy: ప్రభాస్ 'కల్కి' సినిమా చూశా... బాగుంది: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి చిన్నపాటి రివ్యూ

Komatireddy praises Prabhas Kalki movie
  • కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశానని వెల్లడి
  • మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారని కితాబు
  • కల్కి వంటి అద్భుతమైన సినిమాను అందరూ చూడాలన్న మంత్రి

ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నపాటి రివ్యూ రాశారు! తాను సినిమా చూశానని... బాగుందంటూ కితాబునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. 

ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' సినిమాను ఈరోజు కుటుంబ సమేతంగా చూశానని పేర్కొన్నారు. మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సినిమాలో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణేలు అద్భుతంగా నటించారన్నారు. ప్రమఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్, స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించిన ఈ సినిమా ఓ విజువల్ వండర్ అన్నారు.

ఈ సినిమా మరింత అద్భుత విజయం సాధించాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. సిమాలు విజయవంతమైతే పరిశ్రమ పచ్చగా ఉంటుందన్నారు. లక్షలమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రతీ ఒక్కరు... ఈ తరంవారు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ కల్కి వంటి అద్భుతమైన సినిమాను చూడాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News