Jagga Reddy: పదేళ్లలో నేను పీసీసీ చీఫ్‌ను అవుతా... ముఖ్యమంత్రిని కూడా అవుతా: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్య

Jagga Reddy says he will become chief minister in ten years
  • గాంధీ భవన్‌లో తనకు అటెండర్ పదవి ఇచ్చినా చేస్తానని వ్యాఖ్య
  • ఎవరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందని ఆశాభావం
  • మోదీ పవర్ తాత్కాలికమేనన్న జగ్గారెడ్డి

పదేళ్లలో తాను పీసీసీ చీఫ్ అవుతానని... ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా అవుతానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గాంధీ భవన్‌లో తనకు అటెండర్ పదవిని ఇచ్చినా తప్పకుండా చేస్తానన్నారు. తమ పార్టీ అగ్రనాయకులు సోనియా, రాహుల్ గాంధీలు ఏం చెబితే అదే చేస్తానన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తాను ఢిల్లీలో పైరవీలు చేయడం లేదని... ఎవరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల పవర్‌కు, ప్రధాని మోదీ పవర్‌కు చాలా తేడా ఉందన్నారు. పర్మినెంట్ పొలిటికల్ పవర్ సోనియా, రాహుల్ గాంధీలదే అన్నారు. కానీ రాజకీయాల్లో మోదీది తాత్కాలిక పవరే అని బీజేపీ వారు గుర్తించాలన్నారు. ప్రధానిగా ఆయన దిగిపోయాక బీజేపీలోనే పవర్ ఉండదన్నారు. ప్రజలు మూడోసారి చాలా కష్టంగా మోదీకి అధికారం అప్పగించారన్నారు.

గత పదేళ్లలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అంగీకరించి... ఇప్పుడైనా వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గోద్రా అల్లర్లు, పుల్వామా ఘటనలపై పార్లమెంట్‌లో చర్చించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ అని మాట్లాడే బీజేపీ... ఆ సమయంలో లేనే లేదన్నారు. నాడు జనతా పార్టీలో ఉన్న వాజపేయి... ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News