Congress: కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ అలా చేస్తున్నారు: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

Parigi MLA fires at KCR

  • కేసీఆర్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా
  • జగదీశ్ రెడ్డి కోరితేనే జ్యుడీషియల్ విచారణ కమిషన్ వేశామని వెల్లడి
  • కేసీఆర్ అధికారంలో ఉండగా రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శ

ఢిల్లీ మద్యం కేసులో కూతురు కవితను కాపాడుకోవడానికి బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరిగి అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జగదీశ్ రెడ్డి కోరితేనే తాము జ్యుడీషియల్ విచారణ కమిషన్ వేశామన్నారు. తన అవినీతి బయటపడుతుందనే భయంతో కేసీఆర్ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదన్నారు.

కేసీఆర్ అధికారంలో ఉండగా  రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వేలాది కోట్లను దుర్వినియోగం చేశారన్నారు. హరీశ్ రావు మాటలు నమ్మవద్దని... ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళతారని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రజలు రేవంత్ రెడ్డిని కోరుకున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రుణమాఫీ చేశామని, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింటుమెంట్ ఇవ్వని కేసీఆర్... ఇప్పుడు ఫాంహౌస్‌కు పిలిచి భోజనం పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News