Telangana: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

Telangana 10th Class Supplementary Exam Results Released
  • సప్లిమెంటరీ పరీక్ష‌ల్లో 73 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణ‌త
  • అబ్బాయిల ఉత్తీర్ణ‌త 71.01 శాతం
  • అమ్మాయిల ఉత్తీర్ణ‌త‌ 76.37 శాతం
  • ఈ నెల‌ 3 నుంచి 13 వరకు జ‌రిగిన‌ సప్లిమెంటరీ పరీక్షలు
  • ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 51, 237 మంది విద్యార్థుల హాజ‌రు

తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విద్యాశాఖ అధికారులు వీటిని విడుద‌ల చేశారు. సప్లిమెంటరీ పరీక్ష‌ల్లో 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇందులో అబ్బాయిల ఉత్తీర్ణ‌త 71.01 శాతం కాగా, అమ్మాయిల ఉత్తీర్ణ‌త‌ 76.37 శాతంగా న‌మోదైంది. అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. 

ఇక పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 51, 237 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

  • Loading...

More Telugu News