Revanth Reddy: కేటీఆర్ ఉన్న సిరిసిల్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయా?: రేవంత్ రెడ్డి విమర్శలు

Revanth Reddy satires on BRS leaders
  • అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు భారీగా తగ్గాయన్న సీఎం
  • కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్... బీజేపీకి మద్దతు పలికిందని విమర్శ
  • పీవీకి రేవంత్ రెడ్డి నివాళులు

లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లలో ఓడిపోయి... ఎనిమిది సీట్లలో డిపాజిట్ కోల్పోయి, 14 సీట్లలో మూడో స్థానం వచ్చినప్పటికీ కేసీఆర్‌కు కనువిప్పు కలగలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోవడం ప్రజల తప్పే అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికల నాటికి 16 శాతానికి పడిపోయిందన్నారు.

కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని, సిద్దిపేటలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు దాదాపు సమానంగా వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్... బీజేపీకి మద్దతు పలికిందని ఆరోపించారు. బీఆర్ఎస్ తమ కంచుకోటగా చెప్పే మెదక్‌లో కూడా ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందన్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలను మొన్నటి వరకు గేటు వరకు కూడా రానీయలేదని... కానీ ఇప్పుడు ఫామ్ హౌస్‌కు పిలిచి భోజనాలు పెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రమ్మంటే రానీయలేదన్నారు. తెలంగాణ సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడని... ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తున్న... కేసీఆర్ తీరు సరికాదన్నారు.

పీవీకి రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. నేడు పీవీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని అధికారిక నివాసంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పీవీ పరుగులు పెట్టించారన్నారు. పీవీ చిత్రపటానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News