USA: ‘థాంక్యూ సర్‌’.. అన్న మహిళను విమానం ఎక్కనీయని సిబ్బంది!

female passenger stopped boarding plane for mistakingly addressing female attending as sir

  • అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘటన 
  • ఆస్టిన్‌కు వెళ్లేందుకు తన బిడ్డ, తల్లితో విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికురాలు
  • మహిళా సిబ్బందికి బోర్డింగ్ పాస్ ఇచ్చే క్రమంలో సర్ అంటూ ధన్యవాదాలు చెప్పిన వైనం
  • మహిళా అటెండెంట్ ఆగ్రహం, వారిని లోపలికి అనుమతించని వైనం

మహిళా సిబ్బందిని సర్ అని సంబోధించినందుకు తల్లీకొడుకులను విమానం నుంచి దించేసిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో కలిసి ఆస్టిన్‌కు వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ క్రమలో జెన్నా.. మహిళా అటెండెంట్‌ను పురుషుడిగా పొరపాటు పడి 'థ్యాంక్యూ సర్' అని సంబోధించింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె జెన్నాతో పాటు ఆమె తల్లి, బిడ్డను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో జెన్నా మరో సిబ్బంది సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేటు వద్దే ఆయన ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఆ అటెండెంట్ 'ఆయన కాదు ఆమె' అని బదులిచ్చారు. తప్పు తెలుసుకున్న జెన్నా క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. తన ఆవేదనను నెట్టింట వెళ్లబోసుకున్న జెన్నా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News